ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'అర్హులైన అందరికీ ఇళ్ల స్థలాలు అందిస్తాం.. అదే సీఎం జగన్ లక్ష్యం' - etv bharat latest updates

పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ కోసం.. అధికారులు స్థలాల అన్వేషణలో వేగం పెంచారు. ప్రకాశం జిల్లా పర్చూరు పరిధిలోని స్థలాల వివరాలను ఆ ప్రాంత ప్రత్యేక అధికారి స్వయంగా తెలుసుకున్నారు.

special officer visits at home workings process at prakasam district
మార్టూరులో అధికారి ఇళ్లస్థలాల పరిశీలన

By

Published : Jun 29, 2020, 7:16 PM IST

పేదలకు ఇళ్ల స్థలాలు పంచేందుకు.. అందుబాటులో ఉన్న స్థలాలను ఉన్నతాధికారులు పరిశీలిస్తున్నారు. ప్రకాశం జిల్లా పర్చూరు నియోజకవర్గ పరిధిలోని మార్టూరు, రాజుగారిపాలెం, బొబ్బేపల్లిలో.. ప్రత్యేక అధికారి గంగాధర్ గౌడ్ పర్యటించారు. మార్టూరు తహసీల్దార్ తో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.

అర్హులైన వారందరికీ నివాస స్థలాలు ఇవ్వటమే తమ లక్ష్యంగా చెప్పారు. నవరత్నాల్లో భాగంగా ప్రతి పేదవాడికి సొంత ఇంటిని ఏర్పాటు చేయాలనే ధృడ సంకల్పంతోనే.. ముఖ్యమంత్రి వైఎస్​జగన్మోహన్​ రెడ్డి ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నారని తెలిపారు. రెవెన్యూ సిబ్బంది, ఎన్​ఆర్జీఎస్​ సిబ్బంది, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details