వ్యాస పౌర్ణమి సందర్భంగా ప్రకాశం జిల్లా సింగరాయకొండ లో గిరి ప్రదక్షిణ, మెట్లోత్సవం కన్నులపండువగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అద్దంకి వైకాపా నాయకులు బాచిన చెంచుగరటయ్య హాజరయ్యారు. లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ఈవో శ్రీనివాసరావు, వేద పండితులు కార్యక్రమంలో పాల్గొన్నారు. గిరి ప్రదక్షిణ నరసింహస్వామి మెట్ల మార్గం వద్ద నుంచి ప్రారంభమై సాంస్కృతిక కార్యక్రమాలతో ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయం, అభయాంజనేయ స్వామి 99 అడుగుల విగ్రహం, గోపాలపురం భవనాల చెరువు మీదగా మెట్ల వరకు సాగింది. అనంతరం భక్తులు మెట్ల మార్గంలో నడుచుకుంటూ వెళ్ళి నరసింహస్వామి దేవాలయానికి చేరుకున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులకు అన్నదానం నిర్వహించారు.
సింగరాయకొండలో వైభవంగా గిరి ప్రదక్షిణ - narasimhaswamy
ప్రకాశం జిల్లా సింగరాయకొండలో వ్యాసపూర్ణిమ సందర్భంగా గిరి ప్రదక్షిణ, మెట్లోత్సవం నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
గిరి ప్రదక్షిణ