ప్రకాశం జిల్లా బేస్తవారిపేట మండలంలో.. నివర్ తుపాన్ ధాటికి దెబ్బతిన్న పంటలను ఎమ్మెల్యే అన్నా వెంకటరాంబాబు పరిశీలించారు. పలు గ్రామాల్లో పర్యటించి పంట నష్టం వివరాలను అధికారులు, రైతుల నుంచి తెలుసుకున్నారు.
అధికారులు సాధ్యమైనంత త్వరగా పంట నష్టం వివరాలను సేకరించి.. ప్రభుత్వానికి పంపాలని ఎమ్మెల్యే సూచించారు.. తద్వారా సాయం పంపిణీకి సర్కారు చర్యలు తీసుకుంటుందని తెలిపారు.