ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గంలోని పలు మండలాల్లో కరోనా వేగంగా విస్తరిస్తోంది. రోజురోజుకీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో గిద్దలూరులో పలు వ్యాపార దుకాణాల యజమానులు పది రోజులుగా స్వచ్ఛందంగా లాక్ డౌన్ పాటిస్తున్నారు. అలాగే టీ దుకాణాల యజమానులు సైతం ఆదివారం నుంచి ఏడు రోజుల పాటు దుకాణాలు మూసివేస్తున్నట్లు చెప్పారు. కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణలో తమవంతు పాత్రగా స్వచ్ఛందంగా దుకాణాలు మూసివేశామని వ్యాపారులు చెప్పారు.
ఇదీ చదవండి
గిద్దలూరులో స్వచ్ఛందంగా దుకాణాలు మూసివేత - ప్రకాశం కరోనా వైరస్ కేసులు వార్తలు
కరోనా నియంత్రణలో తమవంతు పాత్ర పోషిస్తున్నారు గిద్దలూరు పట్టణంలోని వ్యాపారులు. స్వచ్ఛందంగా షాపులు మూసివేసి ఆదర్శంగా నిలుస్తున్నారు.
giddalur traders voluntarily closed shops due to corona cases increases