ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పూర్వ విద్యార్థులు.. మళ్లీ కలిశారు... సందడి చేశారు! - GET TO GATHER VRS AND YRS COLLEGE

చీరాల వి.ఆర్. ఎస్. అండ్ వై.ఆర్.ఎన్ కళాశాల పూర్వ విద్యార్థులు అపూర్వ సమ్మేళనం జరిగింది. 1986-89 బ్యాచ్ కు చెందిన డీగ్రీ విద్యార్థులు అంతా ఒక్క చోట ఏకమై ఆనాటి మధుర స్మృతులను నెమరేసుకుంటూ ఆనందంగా గడిపారు. తమకు చదువు చెప్పిన గురువులను సన్మానించారు.

'వి.ఆర్.ఎస్ అండ్ వై.ఆర్.ఎస్ 1986-89 డిగ్రీ బ్యాచ్ అపూర్వ సమ్మేళనం'

By

Published : May 13, 2019, 12:08 AM IST

'వి.ఆర్.ఎస్ అండ్ వై.ఆర్.ఎస్ 1986-89 డిగ్రీ బ్యాచ్ అపూర్వ సమ్మేళనం'

వారంతా పూర్వ విద్యార్దులు... ముప్పై ఏళ్ల క్రితం డిగ్రీ చదివి వెళ్లిపోయినవారు మళ్లీ ఇప్పుడు కలిశారు. ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు. యోగ క్షేమాల గురించి ఆరా తీసుకున్నారు. అప్పటి మధురస్మృతులను నెమరవేసుకుని పరవశించిపోయారు...ఈ అపూర్వఘట్టానికి ప్రకాశంజిల్లా చీరాల లోని గాంధీనగర్ వేదికయింది.

ప్రకాశం జిల్లా చీరాల వి.ఆర్. ఎస్. అండ్ వై.ఆర్.ఎన్ కళాశాలలో 1986-89 డిగ్రీ చదివిన పూర్వవిద్యార్థుల అపూర్వ సమ్మేళనం జరిగింది. పూర్వవిద్యార్థులు కుటుంబ సభ్యులతో కలిసి కార్యక్రమానికి హాజరయ్యారు. వారికి చదువు చెప్పిన గురువులను సన్మానించారు. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో చదువుకుని ఉన్నతస్దితికి వచ్చామని.. పూర్వవిద్యార్థులు తెలిపారు.

అప్పుడు చదువుకునేవాళ్ళమని... ప్రస్తుతం చదువు కొనవలసి వస్తుందని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రభుత్వ విద్యను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. తామంతా సంఘంగా ఏర్పడ్డామని అనేక సామాజిక కార్యక్రమాలు చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని పూర్వవిద్యార్థులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details