ప్రకాశం జిల్లా బేస్తవారిపేటలోని రాణిపేట వీధిలో ఉన్న ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలింది. వెంకటేశ్వర్లు అనే వ్యక్తి ఇంట్లో ఈ ఘటన జరిగింది. అగ్నిమాపక సిబ్బంది వెంటనే వచ్చి మంటలను ఆర్పడంతో పెనుప్రమాదం తప్పింది. ఈ ప్రమాదంలో వెంకటేశ్వర్లు తీవ్రంగా గాయపడ్డాడు. అతని పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం ఒంగోలు తరలించారు.
పేలిన గ్యాస్ సిలిండర్.. వ్యక్తికి తీవ్రగాయాలు - ప్రకాశం జిల్లాలో పేలిన గ్యాస్ సిలిండర్
ఇంట్లోని గ్యాస్ సిలిండర్ పేలి వ్యక్తికి తీవ్రగాయాలైన ఘటన ప్రకాశం జిల్లా రాణిపేట వీధిలో జరిగింది. క్షతగాత్రుడిని వైద్యం కోసం పోలీసులు ఆసుపత్రికి తరలించారు.
![పేలిన గ్యాస్ సిలిండర్.. వ్యక్తికి తీవ్రగాయాలు gas cylinder blast](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9305968-1106-9305968-1603612861691.jpg)
గ్యాస్ సిలిండర్ పేలుడు