ప్రకాశం జిల్లా సంతనూతలపాడు నియోజకవర్గంలోని మద్దిపాడు మండలం సీతారాంపురం వద్ద అక్రమంగా లారీలో తరలిస్తున్న గంజాయిని మద్దిపాడు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు ....చెన్నైకి చెందిన నలుగురు వ్యక్తులు విశాఖ నుంచి చెన్నైకి లారీలో 880 కిలోల గంజాయిని తరలిస్తున్నారు . పోలీసుల తనిఖీలో భాగంగా లారీలను పరిశీలించగా లారీలో సుమారు 60లక్షల విలువ చేసే గంజాయిని లారీలో ఉన్న నలుగురు వ్యక్తుల్ని అదుపులోకి తీసుకున్నట్లు డీఎస్పీ ప్రసాద్ తెలియజేశారు. వీరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడతామని వెల్లడించారు.
భారీగా గంజాయి స్వాధీనం...నలుగురి అరెస్ట్ - taja news of ganja seized in prakasam dst
విశాఖ నుంచి చెన్నైకి తరలిస్తున్న 880కిలోల గంజాయిని ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం సీతారాంపురం వద్ద పోలీసులు పట్టుకున్నారు. సరకు స్వాధీనం చేసుకుని నలుగురిని అదుపులోకి తీసుకున్నట్లు డీఎస్పీ ప్రసాద్ తెలిపారు.
![భారీగా గంజాయి స్వాధీనం...నలుగురి అరెస్ట్ ganja seized in prakasam dst four persons arrested](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8135571-15-8135571-1595470572680.jpg)
ganja seized in prakasam dst four persons arrested
TAGGED:
prakasam dst ganja news