ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఇతర దేశాలకు అక్రమంగా చౌక బియ్యం రవాణా.. 31 మంది అరెస్ట్ - ప్రకాశం జిల్లాలో రేషన్ బియ్యం అక్రమ రవాణా వార్తలు

చౌకబియ్యంతో కోట్ల రూపాయల అక్రమ వ్యాపారం చేస్తున్నారు కొందరు. పేదలకు అందాల్సిన బియ్యాన్ని పెట్టుబడిగా పెట్టి అక్రమంగా సొమ్ము ఆర్జిస్తున్నారు. లక్షల కిలోల చౌకబియ్యాన్ని కొని, రీసైక్లింగ్ చేసి ఇతర దేశాలకు రవాణా చేస్తున్నారు. ఎన్నాళ్ల నుంచో ఈ దందా చేస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు.

gang-arrest-in-ration-rice-illegal-transport-in-prakasam-district
రేషన్ బియ్యం అక్రమంగా తరలిస్తున్న ముఠా అరెస్ట్

By

Published : Sep 26, 2020, 7:56 PM IST

రేషన్‌ దుకాణాల్లో పేదలకు విక్రయించే బియ్యం మలేసియా, సింగపూర్‌, దుబాయ్‌ వంటి దేశాలకు అక్రమంగా తరలిస్తున్నారు. ఇందుకోసం ప్రకాశం జిల్లాలో ఓ ముఠా పనిచేస్తోంది.

అక్రమ రవాణా ఇలా

రేషన్‌ దుకాణాల్లో పేదలకు పంపిణీ చేయాల్సిన బియ్యాన్ని కిలో 12 రూపాయల చొప్పున కొనుగోలు చేస్తారు. వాటిని రైస్ మిల్లుల్లో పాలిష్‌ చేసి సన్నబియ్యంగా మారుస్తారు. ఇలా రీ సైక్లింగ్‌ చేసిన బియ్యాన్ని కిలో రూ. 20 చొప్పున బ్రోకర్లకు విక్రయిస్తారు. వారు బియ్యాన్ని కొత్త కొత్త బ్రాండ్లతో ప్యాకింగ్‌ చేసి, అన్ని అనుమతులున్నట్లుగా రవాణాకు సిద్దం చేస్తారు. తర్వాత కృష్ణపట్నం, చెన్నై, పాన్వెల్ పోర్టు తదితర ప్రాంతాలనుంచి ఇతర దేశాలకు ఎగుమతి చేస్తారు.

ప్రణాళిక ప్రకారం పోలీసుల దాడులు

గత కొన్నాళ్ళుగా పలువురు వ్యక్తులు బియ్యం అక్రమ రవాణా చేస్తున్నారన్న విషయాన్ని గమనించిన పోలీసులు ..ఎస్పీ సిద్దార్థ కౌశల్‌ ఆదేశాలతో దాడులు నిర్వహించారు. తొలుత మార్టూరు మండలం వలపర్లలోని ఓ రైస్‌ మిల్లులో దాడి చేయగా 1265 బస్తాల బియ్యం లభించింది.

నేడు సంతనూతలపాడు, దర్శి, పొదిలి, గుడ్లూరు తదితర మండలాల్లో 162 చోట్ల దాడులు నిర్వహించి 16 కేసులు నమోదు చేశారు. ఈ ఒక్కరోజు దాడుల్లో 4.35 లక్షల కిలోల బియ్యం సీజ్ చేశారు. ఈ బియ్యం విలువ సుమారు కోటి రూపాయలు ఉంటుందని ఎస్పీ సిద్దార్థ కౌశల్‌ తెలిపారు. ఈ వ్యవహారంలో మొత్తం 31 మందిని అరెస్టు చేశారు. ఈ కేసులో కీలకంగా వ్యవహరించిన పోలీస్ సిబ్బందిని అభినందించి, వారికి రివార్డులు అందజేశారు.

ఇవీ చదవండి:

తిరుమల, తిరుపతి పోలీసుల ఫేస్‌బుక్‌ ఖాతాలు హ్యాక్‌

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details