ప్రకాశం జిల్లా అద్దంకి మండలం గుండ్లకమ్మ రిజర్వాయర్ పునరావాస కాలనీ ఓటర్లు.. తమ ఓటుహక్కు వినియోగించు కోవాలంటే 30 కి.మీ. దూరం వెళ్లాల్సి ఉంది. దశాబ్దకాలంగా వారు ఇబ్బందులు పడుతున్నారు. ధేనువకొండ గ్రామపంచాయతీలో మొత్తం 3254 మంది ఓటర్లు ఉండగా అందులో పునరావాసకాలనీల్లో 350 మంది ఓటర్లు ఉన్నారు. వీరంతా అద్దంకి సమీపంలోని కొంగపాడు, వేలమూరిపాడు పునరావాసకాలనీల్లో ఉంటున్నారు. తమ దగ్గర్లో పోలింగ్ కేంద్రం లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఓటు వేయాలంటే 30 కి.మీ వెళ్లాల్సిందే..! - కొంగపాడు వేలమూరిపాడు పునరావాసకాలనీలు తాజా వార్తలు
ఓటు వినియోగం కోసం ఒకటి లేదా రెండు కిలోమీటర్ల దూరం వెళ్లాలంటేనే వామ్మో అంటాం. అలాంటిది ఆ గ్రామంలోని ప్రజలు ఓటేసేందుకు 30 కి.మీ దూరం వెళ్లక తప్పదు. వారికి అందుబాటులో ఉన్న ఏకైక పోలింగ్ కేంద్రం అదొక్కటే. ప్రస్తుతం వార్తల్లో నిలుస్తున్న ఆ ప్రాంతం గురించి తెలుసుకోవాలనుందా..?
ఓటు వేయాలంటే 30 కి.మీ వెళ్లాల్సిందే