కొవిడ్‌తో ఎంతో మంది మరణిస్తున్నారు. అందరూ ఉన్నా.. అనాథలుగా అంత్యక్రియలు చేయాల్సిన దయనీయమైన పరిస్థితులు నెలకొన్నాయి. ప్రకాశం జిల్లా చీరాల మండలం ఈపురుపాలెంలోని బండారు నాగేశ్వరరావు కాలనీకి చెందిన ఓ వ్యక్తి కరోనాతో మృతి చెందారు. ఇతనికి బంధువులు ఎవరూ లేరు. విషయం తెలుసుకున్న ఆపద్బంధు ప్రతినిధులు.. ఆ వ్యక్తికి అంత్యక్రియలు నిర్వహించారు. ప్రజల కష్టాల్లో పాలుపంచుకోటానికి తమ సంస్థ ఎప్పుడూ ముందుంటుందని ప్రతినిధి ఒకరు తెలిపారు.
అనాథ శవానికి అంత్యక్రియలు.. మానవత్వం చాటుకున్న ఆపద్బంధు ప్రతినిధులు - covid deaths news
కరోనా పాజిటివ్ కేసులే కాదు.. మరణాలూ పెరుగుతున్నాయి. కొవిడ్‌తో మరణించిన వారికి అంత్యక్రియలు చేసేందుకు బంధువులు వెనకడుగు వేస్తున్నారు. అనాథల పరిస్థితి మరీ దయనీయం. అలాంటి వారికి అంత్యక్రియలు చేస్తూ..మానవత్వం చాటుతున్నారు ఆపద్బంధు సంస్థ ప్రతినిధులు.
అనాథ శవానికి అంత్యక్రియలు నిర్వహిస్తున్న ఆపద్బంధు ప్రతినిధులు