ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అద్దంకిలో జోరుగా మున్సిపల్​ ఎన్నికల ప్రచారం - ఈరోజు అద్దంకిలో ఎన్నికల ప్రచారాలు వార్తలు

ప్రకాశం జిల్లా అద్దంకిలో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ప్రచార ముగింపు సమయం దగ్గర పడుతుండటం.. ఓటర్లను ఆకట్టుకునేందుకు నేతలు జోరుగా ప్రయత్నిస్తున్నారు.

Election campaigns in addanki
అద్దంకిలో జోరుగా ఎన్నికల ప్రచారాలు

By

Published : Mar 8, 2021, 11:47 AM IST

మున్సిపల్​ ఎన్నికల్లో ప్రకాశం జిల్లా అద్దంకి నాలుగో వార్డు సీపీఎం, సీపీఐ బలపరిచిన కౌన్సిలర్ అభ్యర్థి తంగిరాల రజిని ఇంటింటి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తమ ఎన్నికల గుర్తు సుత్తి కొడవలి నక్షత్రానికి ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు కాకర్ల వెంకటేశ్వర్లు, పార్టీ జిల్లా నాయకులు వి. బాలకోటయ్య, ఆటో వర్కర్స్ యూనియన్ నాయకులు ఎం. చక్రవర్తి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

జిల్లాలోని పలు వార్డుల్లో తెదేపా తరపున కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీ చేసిన వారికి మద్దతుగా అద్దంకి శాసనసభ్యులు గొట్టిపాటి రవికుమార్ ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అవినీతి రహిత సమాజం కావాలన్నా, పట్టణంలోని తాగునీరు డ్రైనేజ్ వంటి ప్రధాన సమస్యలు తొలగిపోవాలంటే సైకిల్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

అద్దంకి పట్టణంలోని మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా బాపట్ల పార్లమెంట్ సభ్యులు నందిగం సురేష్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఫ్యాను గుర్తుకు ఓటు వేసి మున్సిపల్ ఎన్నికల్లో విజయానికి కృషి చేయాలని సురేష్ తెలిపారు. ప్రచార ర్యాలీలో వైకాపా కార్యకర్తలు, అభిమానులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

ఇవీ చూడండి...ప్రకాశం జిల్లా పురపోరులో జోరుగా పార్టీల ప్రచారం

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details