ప్రకాశం జిల్లాలో కోవిడ్ ఉద్ధృతి పెరుగుతోంది. జిల్లాకు వచ్చే కేసులన్నీ చాలావరకు ఇతర పట్టణాల నుంచే వస్తున్నాయి. వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు అధికారులు చర్యలు ముమ్మరం చేశారు. ఇప్పటికే ఒంగోలు, చీరాలలో పూర్తి లాక్డౌన్ విధిస్తున్నట్లు కలెక్టర్ పోలా భాస్కర్ ప్రకటించారు. మార్కాపురంలోనూ కోవిడ్ పాజిటివ్ కేసులు విజృంభించడంతో.. అక్కడ కూడా 14 రోజులపాటు పూర్తి లాక్డౌన్ను విధిస్తున్నట్లు ఆర్డీఓ శేషిరెడ్డి తెలిపారు మార్కాపురం మండలంలోనే 7 కేసులు నమోదయ్యాయి. వారందరినీ ఒంగోలు రీమ్స్కు తరలించారు. వారిలో ఇద్దరి కానిస్టేబుళ్లకు కూడా కరోనా పాజిటివ్ రావడంతో.. పట్టణ వాసుల్లో ఆందోళన నెలకొంది. ఉదయం 6 నుంచి 10 వరకు మాత్రమే నిత్యావసర దుకాణాలకు అనుమతి ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు.
మార్కాపురంలో 14 రోజులపాటు పూర్తి లాక్డౌన్ - మార్కాపురంలో కరోనా పాజిటివ్ కేసులు
ప్రకాశం జిల్లాలో కరోనా కేసులు రోజురోజుకి పెరుగుతున్నాయి. ఇప్పటికే ఒంగోలు, చీరాలలో లాక్డౌన్ విధిస్తున్నట్లు కలెక్టర్ పోలా భాస్కర్ ప్రకటించారు. అదే తరహాలో మార్కాపురంలోనూ కోవిడ్ పాజిటివ్ కేసులు విజృంభించడంతో.. అక్కడ కూడా 14 రోజులపాటు పూర్తి లాక్డౌన్ను విధిస్తున్నట్లు ఆర్డీఓ శేషిరెడ్డి తెలిపారు.
మార్కాపురంలో 14 రోజులపాటు పూర్తి లాక్డౌన్