ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

యువకుడిపై పెట్రోలు పోసి సజీవ దహన యత్నం.. తీవ్ర గాయాలు.. - ప్రకాశం జిల్లా నేర వార్తలు

ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం నేలటూరులో... దారుణఘటన చోటు చేసుకుంది. ప్రేమ వ్యవహారంపై అనుమానంతో... ఓ యువకుడిని మిత్రులే సజీవ దహనం చేసేందుకు యత్నించారు.

యువకుడిపై పెట్రోలు పోసి నిప్పంటించిన మిత్రులు
యువకుడిపై పెట్రోలు పోసి నిప్పంటించిన మిత్రులు

By

Published : May 3, 2021, 10:31 AM IST

Updated : May 3, 2021, 1:14 PM IST

యువకుడిపై పెట్రోలు పోసి నిప్పంటించిన మిత్రులు

ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం నేలటూరులో.. దారుణఘటన చోటు చేసుకుంది. ప్రేమ వ్యవహారంపై అనుమానంతో... ఓ యువకుడిని సజీవ దహనం చేసేందుకు యత్నించారు. నేలటూరు గ్రామానికి చెందిన 20ఏళ్ల ఎర్రజానీ అంకమ్మరావు.. బేల్దారి పని చేసుకుంటూ జీవస్తున్నాడు. ఇతను అదే గ్రామానికి చెందిన యువతితో ప్రేమలో పడ్డాడు. ఈ విషయమై యువతి కుటుంబ సభ్యులు అతడ్ని గతంలో హెచ్చరించినట్లు సమాచారం. ఆదివారం రాత్రి బేల్దారు మేస్త్రీ పిలుస్తున్నాడంటూ.. అతడిని మిత్రులు ఊరు బయటకు తీసుకెళ్లారు. ఆ తర్వాత అతడిపై పెట్రోల్ పోసి నిప్పంటించినట్టు సమాచారం. మంటలతోనే అతను గ్రామంలోకి పరిగెత్తుకుంటూ వచ్చి పడిపోయాడు. గమనించిన స్థానికులు నీరుపోసి మంటలు ఆర్పారు. అతడ్ని ఒంగోలు రిమ్స్‌కు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు హత్యాయత్నానికి కారణాలపై దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చదవండి:

Last Updated : May 3, 2021, 1:14 PM IST

ABOUT THE AUTHOR

...view details