ప్రకాశం జిల్లా బల్లికురవ మండలం గుంటుపల్లి పంచాయతీలోని కొత్త పాలెం గ్రామంలో క్రికెట్ యూత్ ఆధ్వర్యంలో 200 కుటుంబాలకు ఉచితంగా కూరగాయల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఇటువంటి క్లిష్ట సమయంలో యువత ముందుకు వచ్చి గ్రామంలోని వారికి పంపిణీ చేయటం ప్రశంశనీయమని పలువురు అభినందించారు. సుమారు 15 వేల రూపాయల వ్యయంతో కూరగాయలను పంపిణీ చేస్తున్నట్లు దాతలు తెలియజేశారు.
200 కుటుంబాలకు క్రికెట్ యూత్ కూరగాయల పంపిణీ - youth freely distributed vegies
దేశవ్యాప్తంగా హడలెత్తిస్తున్న మహమ్మారి వ్యాధి కరోనా నియంత్రణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ విధించాయి.... సామాన్య ప్రజలు లాక్ డౌన్ కారణంగా అనేక ఇబ్బందులు పడుతున్నారు. కనీస అవసరాలు కూడా తీర్చుకోలేని పరిస్థితి నెలకొంది. ఈ పరిస్థితుల్లో యువత గ్రామాల్లో ముందుకొచ్చి పేద ప్రజలకు సహాయం అందిస్తున్నారు.

200 కుటుంబాలకు ఉచితంగా కూరగాయల పంపిణీ
ఇది చూడండితేలికపాటి వర్షం... మిర్చి రైతుల ఆందోళన