కరోనా ఎఫెక్ట్... చాకిరాలలో రూ.40కే 3కేజీల కోడి - చికెన్ పై కరోనా ప్రభావం
కరోనా ప్రభావం పౌల్ట్రీ పరిశ్రమ మీద పడింది. చికెన్ తింటే వైరస్ వస్తుందనే పుకార్లతో పరిశ్రమ యజమానులు తీవ్ర నష్టాలను చవి చూస్తున్నారు. చేసేదేమీ లేక ఒక ప్రాంతంలో ఉచితంగా కోళ్లను, చికెన్‌ను పంపిణీ చేస్తుంటే... మరో చోట ఉచితంగా ఇస్తున్నారు.
కరోనా ఎఫెక్ట్... చాకిరాలలో రూ.40కే 3కేజీల కోడి
కరోనా భయంతో కోళ్ల పరిశ్రమ యజమనులు చౌకగా కోళ్లను విక్రయిస్తున్నారు. కనిగిరి మండలం చాకిరాల గ్రామంలో 3కేజీల బరువున్న కోళ్ళను కేవలం 50 రూపాయలకే అమ్ముతున్నారు. చికెన్ విషయానికి వస్తే కేజీ 40రూపాయలకే విక్రయిస్తున్నారు. ఇవాళ సుమారు 4వేల కోళ్లను అమ్మినట్లు యజమానులు తెలిపారు. ఎంతో కొంతకు అమ్ముకుంటే కనీసం దాణా ఖర్చుకైనా వస్తాయని అంటున్నారు.