ప్రకాశం జిల్లా చీరాలలో సమాజ్ వాదీ పార్టీ జిల్లా అధ్యక్షులు సయ్యద్ బాబు ఆధ్వర్యంలో వికలాంగులు, గర్భిణులకు ఉచిత ఆటో సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు. ప్రభుత్వాసుపత్రికి వచ్చే వారు పడుతున్న ఇబ్బందులను చూసి చలించిపోయానని... ఈ పరిస్థితుల్లో తమవంతు సహాయంగా ఒక ఆటో ఏర్పాటు చేశానన్నారు.
చీరాల, ఓడరేవు, కారంచేడు, వేటపాలెం, ఈపురుపాలెం గ్రామాల వికలాంగులకు, గర్భిణీ స్త్రీలు వైద్య సౌకర్యం కోసం ఉచితంగా ఆటో సౌకర్యాన్ని ఉపయోగించుకోవచ్చని తెలిపారు. రాత్రి, పగలు తేడాలేకుండా ఏ సమయంలోనైనా... 63092 48395కి ఫోన్ చేస్తే, వెంటనే ఆటో వచ్చి ఆసుపత్రికి తీసుకెళుతుందన్నారు. ఇది పూర్తిగా ఉచిత సౌకర్యమని, రాబోయే రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామని తెలిపారు.