Fraud: ముందు కొన్ని డబ్బులు కడితే.. భారీ మొత్తంలో నిధులు వస్తాయని నమ్మబలికి ఓ అమాయకుడిని మోసం చేశారు కేటుగాళ్లు.. రూ.30 లక్షలు ఇస్తే రూ.18 కోట్లు ఇస్తానంటూ చెప్పిన మాటలకు లొంగి అప్పుతెచ్చి మరీ నగదు చెల్లించాడు. తీరా నెలలు గడుస్తున్నా ఎలాంటి స్పందన లేకపోవడంతో ఆత్యాహత్యాయత్నం చేశాడు బాధితుడు.
మేనేజర్లమంటూ నమ్మించి...
fraud: ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం మద్దిరాల ముప్పాళ్లకు చెందిన గుడిపాటి శ్రీనివాసరావుకు.. అదే ప్రాంతానికి చెందిన ఆదిత్య శివకుమార్, శారదాదేవి అనే వారితో పరిచయం ఏర్పడింది. వారిద్దరిలో ఒకరు బ్యాంకులో మేనేజర్‌గా, మరొకరు బోష్ కంపెనీ మేనేజర్‌గానూ పని చేస్తున్నామని నమ్మబలికారు.
fraud: బోష్ కంపెనీలో లక్ష్మీ వెంకటేశ్వర జ్ఞానపీఠం, తిరుపతి శ్రీ సాయి అమృత ఆస్ట్రాలజీ యోగా ట్రస్ట్, పుట్టపర్తి అచలానంద ఆశ్రమం చారిటబుల్ ట్రస్ట్ ఒంగోలులో యోగ మొదలైన ట్రస్టుల పేరుతో రూ.వేల కోట్ల నిధులు బ్యాంకు ఖాతాలో ఉన్నాయని.. వాటిని తీసేందుకు కొంత నగదు చెల్లిస్తే కోట్లల్లో డబ్బులు వస్తాయని నమ్మించారు. వారిలో ఒకరు ట్రస్ట్ మేనేజర్‌గా ఉన్నట్లు చెప్పారు. వీటిలో కొన్ని ప్యాకేజీలు కూడా ఉన్నాయని తెలిపారు.