ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేస్తున్నాం అని అధికారులు చెప్తున్నా... అవి మాటలకే పరిమితవుతున్నాయా అన్న సందేహం కలగటం మానటంలేదు. ఎందుకుంటే అర్ధరాత్రి సమయంలో ఇసుకాసురులు యథేచ్ఛగా ఇసుకను రవాణా చేసేస్తున్నారు. ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలం తమ్మలూరు చిలకలేరు వాగులో ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు నాలుగు లారీలను సీజ్ చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు, ఇసుకను ఎక్కడకు రవాణా చేస్తున్నారో దర్యాప్తు చేస్తున్నారు.
ఇసుకను తరలిస్తున్న నాలుగు లారీలు సీజ్ - tammulur latest news
ప్రకాశం జిల్లా తమ్మలూరులో అక్రమంగా ఇసుకను తరలిస్తున్న లారీలను పోలీసులు సీజ్ చేశారు. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.
ఇసుకను తరలిస్తున్న లారీలు సీజ్