'అప్పుడే అందరికీ ప్రభుత్వ ఫలాలు అందుతాయి' - ప్రకాశం జిల్లాలో నూతన సచివాలయ భవన శంకుస్థాపన
అద్దంకి మండలం మనికేశ్వరం గ్రామంలో నూతన గ్రామసచివాలయ భవన నిర్మాణానికి... మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి శంకుస్థాపన చేశారు. అనంతరం సంతమాగులూరు మండలం ఏల్చూరు గ్రామంలో విద్యుత్ ఉపకేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. ప్రతీ వాలంటీర్ తమ విధులను సక్రమంగా నిర్వర్తించాలని సూచించారు. అప్పుడే అందరికీ ప్రభుత్వ ఫలాలు అందుతాయని మంత్రి పేర్కొన్నారు.