Cyclone Mandaus: ప్రకాశం జిల్లాలో ఇటీవల మాండౌస్ తుపాను వల్ల పెద్ద మొత్తంలో పంటలు నష్టపోయాయి. జిల్లాలోని 35 మండలాలు,510 గ్రామాల్లో 67,265 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. ఇందులో మినుము, పెసర, వేరుసెనగ, పొగాకు, పత్తి, మిర్చి, సెనగ తదితర పంటలు ఉన్నాయి. రోజులు గడుస్తున్న పొలాల్లో తడి ఆరక ఇటీవల వేసిన పంట మొత్తం కుళ్ళిపోయింది. నీళ్లను పొలాల నుంచి బయట పంపించి మొక్కలను రక్షించుకోనేందుకు రైతులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. మందులు పిచికారి చేసుకుంటూ పంట రక్షణ చర్యలు చేపడుతున్నారు. ఇప్పటికే లక్షల్లో పెట్టుబడులు పెట్టామని, అవి మొత్తం నష్టపోగా, మళ్లీ పంట వేయాలంటే ఆర్థిక ఇబ్బందులతో రైతులు వాపోతున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి సహాయం చేయాలని రైతులు కోరుతున్నారు.
జిల్లాలో సాధారణ పంట నష్టాలను అంచనా చేపడుతున్నామని, ఈ ప్రక్రియ ఈనెల 27వ తేదీ కల్లా పూర్తి చేసి ప్రభుత్వానికి నివేదిక పంపిస్తామని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రీనివాసరావు తెలిపారు.
ప్రకాశం జిల్లాలో పంటలను మట్టిపాలు చేసిన మాండౌస్.. సాయం కోసం రైతన్నల ఎదురు చూపులు - అపార నష్టం ప్రకాశంలో
Cyclone Mandaus: ప్రకాశం జిల్లాలో ఇటీవల మాండౌస్ తుపాను వల్ల పెద్ద మొత్తంలో పంటలు నష్టపోయాయి. చెరువులుగా మారిన పొలాల్లో నుంచి నీటిని బయటకు పంపేందుకు రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. ఈ ప్రక్రియ ఈనెల 27వ తేదీ కల్లా పూర్తి చేసి ప్రభుత్వానికి నివేదిక పంపిస్తామని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రీనివాసరావు తెలిపారు.
పంటలు