ఎర్రగొండపాలెంలో రాజీవ్ గాంధీ 30వ వర్ధంతి వేడుకలు - yerragondapalem latest news
రాజీవ్ గాంధీ దేశానికి ఎనలేని సేవ చేసిన మహోన్నతుడు అని ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం నియోజక వర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి మెడబలిమి వెంకటేశ్వరరావు అన్నారు. స్థానిక పార్టీ కార్యాలయంలో రాజీవ్ గాంధీ 30వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు.
![ఎర్రగొండపాలెంలో రాజీవ్ గాంధీ 30వ వర్ధంతి వేడుకలు death anniversary](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-03:00:51:1621589451-ap-ong-31-21-rajiv-ghnadhi-vardhanti-vedukalu-av-ap10073-21052021123928-2105f-1621580968-526.jpg)
భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ సాంకేతిక విప్లవ రంగంలో దేశానికి అభివృద్ధి ఫలాలను అందించిన మహోన్నత వ్యక్తి అని ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం నియోజక వర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి మెడబలిమి వెంకటేశ్వరరావు అన్నారు. ఎర్రగొండపాలెంలోని పార్టీ కార్యాలయంలో రాజీవ్ గాంధీ 30వ వర్ధంతిని నిర్వహించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. దేశానికి ఎనలేని సేవ చేసిన మహోన్నతుడు రాజీవ్ గాంధీ అని కొనియాడారు.
ఇదీ చదవండి:ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ రద్దుచేస్తూ హైకోర్టు తీర్పు