ప్రకాశం జిల్లాలో రెండవదశ పంచాయతీ ఎన్నికలు.. అక్కడక్కడా చెదురు మదురు ఘటనలు మినహా ప్రశాంతంగా జరిగాయి. సంతమాగులూరు మండలం ఏల్చూరులో 14 వ వార్డు.. ఓటర్ల జాబితాలో యాభై ఓట్లు తేడా రావడంతో కొద్దిసేపు ఎన్నికలు నిలిపివేశారు. అనంతరం సవరించిన జాబితాను మళ్లీ ప్రకటించటంతో పోలింగ్ పునఃప్రారంభం అయింది. తొలుత మందకొడిగా సాగిన ఎన్నిక.. క్రమక్రమంగా పెరుగుతూ వచ్చింది.
మార్కాపురం మాజీ ఎమ్మెల్యే నారాయణ రెడ్డి గృహనిర్భంధం - మాజీ తెదేపా ఎమ్మెల్యే నారాయణ రెడ్డి గృహనిర్భంధం
ప్రకాశం జిల్లాలో రెండో విడత ఎన్నికలు ముగిశాయి. సమస్యాత్మక గ్రామాల్లో కూడా ప్రశాంతంగా ఎన్నికలు జరగటంతో అధికారులు సంతృప్తి వ్యక్తం చేశారు. అయితే మార్కాపురం తెదేపా మాజీ ఎమ్మెల్యే నారాయణ రెడ్డిని పోలీసులు గృహనిర్భంధం చేయటం చర్చనీయాంశంగా మారింది.
మార్కాపురం మాజీ ఎమ్మెల్యే నారాయణ రెడ్డి హౌస్ అరెస్ట్
మార్కాపురం తెదేపా మాజీ ఎమ్మెల్యే నారాయణ రెడ్డిని పోలీసులు గృహనిర్భంధం చేయటం చర్చనీయాంశంగా మారింది. అధికార పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులు విచ్చలవిడిగా ఓటర్లను, అధికారులను భయభ్రాంతులకు గురి చేస్తున్నా.. పోలీసులు చోద్యం చూస్తున్నారని నారాయణ రెడ్డి ఆరోపించారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణకు సహకరించే తమను నిర్బంధించటం ఏమిటని ఆయన ప్రశ్నించారు.
ఇదీ చదవండీ..ఒకే గ్రామం.. ఇద్దరు సర్పంచులు.. ఒకరేమో ఏకగ్రీవం!