రాష్ట్రవ్యాప్యంగా ఎస్సీల బతుకులు అగమ్యగోచరంగా తయారయ్యాయనీ... పది రోజులుగా దళితులపై వరుస దాడులు జరుతున్నాయని మాజీ న్యాయమూర్తి జడా శ్రవణ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రకాశంజిల్లా చీరాల పొలీసుల దాడిలో మృతిచెందిన ఎరిజర్ల కిరణ్ కుమార్ కుటుంబసభ్యులను మాజీ న్యాయమూర్తి శ్రవణ్ కుమార్ , ప్రజాసంఘాల నాయకులు పరామర్శించారు. సంఘటన వివరాలను కుటుంబసభ్యులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... రాష్ట్రంలొ ఎస్సీలే లక్ష్యంగా పెట్టుకుని దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు. దానికి సాక్ష్యమే ఇటివల ఒక డాక్టరు మాస్కు అడిగాడని పశువుకంటే హీనంగా కొట్టడం... చీరాలలో మాస్కు పెట్టుకోలేదని కొట్టి చంపేయటం... దళిత యువకుడికి శిరోముండనం చేయటం అని ఆవేదన వ్యక్తం చేశారు.
'రాష్ట్రంలో ఎస్సీల బతుకులు అగమ్యగోచరంగా తయారయ్యాయి' - former judge jada sravan kumar news
చీరాల పోలీసుల దాడిలో మరణించిన కిరణ్ కుమార్ కుటుంబ సభ్యులను మాజీ న్యాయమూర్తి జడా శ్రవణ్ కుమార్ పరామర్శించారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్య పాలన నడుస్తుందో.. రాచరిక పాలన నడుస్తుందో అర్థం కావటం లేదని అన్నారు.
రాష్ట్రంలో ప్రజాస్వామ్య పాలన నడుస్తుందో... రాచరికపాలన సాగుతుందో అర్దంకావటం లేదన్నారు. రాష్ట్రంలో ఎక్కువ శాతం ఎస్సీ, ఎస్టీ ఓట్లతో గెలిచి సింహాసనం ఎక్కి.... వారిపైనే దాడులు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. చీరాలకు సంబంధించి ఒక్క ఎస్సైనూ సస్పెండ్ చేయలేని పరిస్దితిలో ఉన్న ప్రభుత్వాన్ని, పోలీస్ వ్యవస్దను ఏమి చేయాలో అర్దంకావటంలేదని అన్నారు. చీరాల ఘటనకు బాధ్యులైన ఎస్సై విజయ్ కుమార్తో పాటు డీఎస్పీ, సీఐ, మిగిలిన పోలీస్ సిబ్బందిని సస్పెండ్ చేయాలని జడా శ్రవణ్ కుమార్ డిమాండ్ చేసారు.