ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మహిళల రక్షణ కోసం'అభయ్ డ్రాప్ హోమ్'

మహిళల రక్షణ కోసం ప్రకాశం జిల్లా పోలీసులు 'అభయ్ డ్రాప్ హోమ్' సేవలను ప్రయోగాత్మకంగా అమల్లోకి తీసుకొచ్చారు. ఆపదలో ఉన్న మహిళలు డయల్ 100కి ఫోన్ చేస్తే... ఈ వాహనం వారిని ఇంటివద్ద సురక్షితంగా దింపుతుందని జిల్లా ఎస్పీ తెలిపారు.

for-women-safety-abhay-vehicles-started-in-prakasam-district
మహిళల రక్షణ కోసం'అభయ్ డ్రాప్ హోమ్'

By

Published : Dec 4, 2019, 9:53 PM IST

మహిళల రక్షణ కోసం'అభయ్ డ్రాప్ హోమ్'

మహిళల రక్షణ కోసం ప్రకాశం జిల్లా పోలీసులు 'అభయ్ డ్రాప్ హోమ్' సేవలను ప్రయోగాత్మకంగా అమల్లోకి తీసుకొచ్చారు. జిల్లా పోలీసు కార్యాలయం వద్ద 8 అభయ్ వాహనాలను జిల్లా ఎస్పీ సిద్దార్థ్ కౌశల్ ప్రారంభించారు. రాత్రివేళ ఒంటరిగా ప్రయాణం చేసే మహిళలు డయల్ 100కి కాల్ చేసిన వెంటనే... వారున్న ప్రదేశానికి పోలీసులు వచ్చి ఇంటి వద్ద సురక్షితంగా దింపుతారని ఎస్పీ తెలిపారు.

ఇందుకోసం వాహనంలో ప్రత్యేకంగా మహిళా పోలీసులు ఉంటారన్నారు. రాత్రి 9 గంటల నుంచి తెల్లవారుజాము 5 గంటల వరకు ఈ సేవలు అందుబాటులో ఉంటాయని వివరించారు. ప్రస్తుతం ఒంగోలు సబ్ డివిజన్​లో నాలుగు వాహనాలు.. మార్కాపురం, కందుకూరు సబ్ డివిజన్​లో ఒక్కో వాహనం.. చీరాల సబ్ డివిజన్​లో రెండు వాహనాలను అందుబాటులోకి తీసుకొచ్చామని తెలిపారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details