ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

బేకరీలపై ఆహార భద్రతాధికారుల దాడులు - కనిగిరిలో ఆహార భద్రతా అధికారుల దాడులు

ప్రకాశం జిల్లా కనిగిరిలో బేకరీలు, దుకాణాలపై ఆహార భద్రతాధికారులు దాడి చేశారు. నిల్వ ఉంచిన, నాసిరకమైన ఆహారాన్ని గుర్తించారు. నాణ్యతలేని ఆహారంపై కేసు నమోదు చేస్తామని అధికారులు తెలిపారు.

Food security guards attack bakeries at kanigiri
బేకరీలపై ఆహార భద్రతాధికారులు దాడి

By

Published : Dec 1, 2020, 4:13 PM IST

ప్రకాశం జిల్లా కనిగిరి పట్టణంలో పలు బేకరీలు, దుకాణాలను ఆహార భద్రతాధికారులు తనిఖీలు చేశారు. రెండు, మూడు రోజుల పాటు నిల్వ ఉన్న, నాణ్యతలేని బ్రెడ్​లను, రసాయనాలు కలిపిన పానీయాలను విక్రయిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. దుకాణాల యజమానులపై కేసులు నమోదు చేయనున్నట్లు ఆహార భద్రతాధికారి నాగూర్ మీరా తెలిపారు. కాలం తీరిన ఆహార పదార్థాలను విక్రయిస్తున్నారనే అనుమానంతో.. తనిఖీలు నిర్వహించినట్లు తెలిపారు. రాబోయే రోజుల్లో ఆకస్మిక దాడులు నిర్వహించి.. కల్తీ ఆహారం విక్రయించకుండా అడ్డుకుంటామని నాగూర్ మీరా తెలిపారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details