ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

దాతల దాతృత్వం.. అన్నార్తుల కళ్లల్లో ఆనందం - ప్రకాశం జిల్లా నేటి వార్తలు

లాక్​డౌన్​తో ఉపాధి కోల్పోయిన పేదలు, చిరువ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వీరి అవస్థను గమనించిన పలువురు దాతలు, స్వచ్ఛంద సంస్థలు తమవంతు సహాయం అందిస్తున్నారు. వారికి తోచినంత సహాయం చేస్తూ దాతృత్వాన్ని చాటుకుంటున్నారు.

food-essential-needs-distribution-for-poor-people-in-prakasam-west-godavari-districts
దివ్యాంగులకు నిత్యావసరాలు పంపిణీ చేస్తున్న దాతలు

By

Published : May 7, 2020, 9:06 PM IST

ప్రకాశం జిల్లాలో...

లాక్​డౌన్ సమయంలో దివ్యాంగులు పడుతున్న ఇబ్బందులను గమనించిన ఇండియన్ రెడ్​క్రాస్ ప్రతినిధులు వారికి ఆపన్నహస్తం అందించారు. ప్రకాశం జిల్లా చీరాల, కొత్తపేటలో దివ్యాంగులకు బియ్యం, నిత్యావసర సరకులు అందించారు. భౌతికదూరం పాటిస్తూ సరకులు పంపిణీ చేశారు.

పశ్చిమగోదావరి జిల్లాలో..

నరసాపురంలో గత కొన్ని రోజులుగా లాక్​డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న ఫొటోగ్రాఫర్లకు సీనియర్ న్యాయవాది చదలవాడ జ్ఞాన ప్రకాష్ నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. పని లేని సమయాన.. రోజు గడవడం ఎంత కష్టంగా ఉంటుందో తనకు తెలుసని అన్నారు.

ఇదీచదవండి.

విశాఖ ఘటనపై ప్రధాని కార్యాలయం ప్రత్యేక దృష్టి

ABOUT THE AUTHOR

...view details