ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆక్సిజన్ సిలిండర్ వాహనాలు ప్రారంభించిన కలెక్టర్ పోలా భాస్కర్ - flagging to Oxygen Cylinders vehicle at ongole

బ్లాక్ ఫంగస్ ప్రభావం కొవిడ్ నుంచి బయట పడిన వారిపైనే ఎక్కువగా ఉంటుందని ప్రకాశం జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ అన్నారు. ఒంగోలులోని కలెక్టరేట్ వద్ద ఆక్సిజన్ సిలిండర్ వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు.

flagging to Oxygen Cylinders vehicle at ongole
flagging to Oxygen Cylinders vehicle at ongole

By

Published : May 17, 2021, 6:01 PM IST

మాగుంట శ్రీనివాసులురెడ్డి.. తన సొంత నిధులతో ఏర్పాటు చేసిన 108 ఆక్సిజన్​ సీలిండర్ల ఉన్న వాహనాలను ప్రకాశం జిల్లా ఒంగోలులో కలెక్టరేట్ వద్ద కలెక్టర్ పోలా భాస్కర్ జెండా ఊపి ప్రారంభించారు. కొవిడ్ విపత్కర పరిస్థితుల్లో చేయూత అందించిన మాగుంట కుటుంబానికి కలెక్టర్ కృతజ్ఞతలు తెలిపారు.

ఒంగోలులో బ్లాక్ ఫంగస్ కేసు నమోదైనందున జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సూచించారు. కొవిడ్ నుంచి బయట పడిన వారిపైనే దీని ప్రభావం చూపుతుందని పేర్కొన్నారు. త్వరలోనే ఓ నోడల్ అధికారిని నియమంచి బ్లాక్ ఫంగస్​పై అవగాహన కల్పిస్తామని ఆయన తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details