వెంకటేశ్వర్లు అనే వ్యక్తి మేకలను మేపేందుకు ప్రకాశం జిల్లా పామూరు మండలం అచ్చంపల్లి గ్రామ సమీపంలోని కొండ మైదాన ప్రాంతానికి తీసుకెళ్లాడు. ఒక్కసారిగా ఈదురుగాలులు, మెరుపులు, ఉరుములతో కూడిన వర్షం పడింది. ఆయన తిరుగు పయనమయ్యాడు. మార్గమధ్యలో ఆకస్మాత్తుగా పిడుగులు పడ్డాయి. పిడుగుపాటుకు గురై ఐదు మేకలు అక్కడికక్కడే మృతి చెందాయి. వాటి విలువ సుమారు రు.1,00,000/-ఉంటుందని, మేకల మృతితో నష్టపోయానని వెంకటేశ్వర్లు కన్నీటి పర్యంతమయ్యాడు.
పిడుగుపాటుకు ఐదు మేకలు మృతి - పిడుగు పడి ఐదు గొర్రెలు మృతి
పిడుగు పడి ఐదు మేకలు మృతి చెందిన ఘటన ప్రకాశం జిల్లా పామూరు మండలం అచ్చంపల్లి గ్రామంలో చోటు చేసుకుంది.
పిడుగు పడి ఐదు గొర్రెలు మృతి