..
గుజరాత్లో ఐదుగురు ప్రకాశం జిల్లా వాసుల మృతి - గుజరాత్ రోడ్డు ప్రమాదం
సోమ్నాథ్ తీర్థయాత్ర ఓ కుటుంబంలో విషాదాన్ని నింపింది... గుజరాత్ రాష్ట్రం సురేంద్రనగర్ జిల్లా దేవపారా గ్రామ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రకాశంజిల్లా వాసులు మృతిచెందారు. జిల్లాలోని చీరాల మండలం జాండ్రపేటకు చెందిన కామిశెట్టి సుబ్రమణ్యం, రాజ్యలక్ష్మి, గణేష్, అఖిల్, దుర్గాభవాని అక్కడకక్కడే మృతి చెందగా... కుశలత, బొడ్డు నాగేంద్రం, రుషిక్ పరిస్థితి విషమంగా ఉంది. సోమ్నాథ్ తీర్థయాత్ర ముగించుకుని అహమ్మదాబాద్కు వాహనంలో బయల్దేరారు. వీరు ప్రయాణిస్తున్న వాహనం అదుపుతప్పి డివైడర్ను ఢీకొని ఎదురుగా వస్తున్నవాహనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో ఐదుగురు మృతిచెందారు. మిగిలిన క్షతగాత్రులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రమాద వార్తతో జాండ్రపేటలో విషాదఛాయలు అలముకున్నాయి. మృతుల బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు.
గుజరాత్లో ఐదుగురు ప్రకాశం జిల్లా వాసుల మృతి