ప్రకాశం జిల్లా చీరాల మండలం వాడరేవు లో ఫిషింగ్ హార్బర్ ఏర్పాటు కానుందని కలెక్టర్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. వాడరేవులో హర్బర్ నిర్మించనున్న స్థలాన్ని పరిశీలించారు.
తీరప్రాంతంలో మొత్తం 19.94 ఎకరాల ప్రభుత్వ భూమి ఉందని, 5.10 ఎకరాలు ఆక్రమణకు గురైందని తహసీల్దార్ కలెక్టర్‌కు వివరించారు. తీరం వద్ద ప్రభుత్వ అతిథి గృహం సమీపంలో ఆక్రమణకు గురైన మరో రెండు ఎకరాలు భూమిని చీరాల తహసీల్దార్‌తో కలిసి కలెక్టర్ పరిశీలించారు. ప్రభుత్వ భూమిని ఆక్రమిస్తూ ఉంటే రెవెన్యూ అధికారులు, ఆర్ఐ, సర్వేయర్లు ఏం చేస్తున్నారని కలెక్టర్ అసహనం వ్యక్తం చేశారు. భూములపై సమగ్ర నివేదికను తక్షణమే ఇవ్వాలని తహసీల్దార్ హుస్సేన్ ను ఆదేశించారు.
చీరాలలో త్వరలో ఫిషింగ్ హార్బర్ - Chirala port
చీరాల మండలం వాడరేవు ప్రాంతంలో ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురవుతుంటే ఏంచేస్తున్నారని తహసీల్దార్లని ప్రకాశం జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారు. అక్కడున్న భూములపై సమగ్ర నివేదికను తక్షణమే ఇవ్వాలని తహసీల్దార్ హుస్సేన్‌ను ఆదేశించారు. మండలంలోని ఓడరేవులో ఫిషింగ్ హార్బర్ ఏర్పాటు కానుందని తెలిపారు.
చీరాల ఓడరేవు
మత్స్యకారులకు సునామి కాలనీలో ఇంటి స్థలాలను కేటాయించినప్పటికీ వారు వెళ్లడంలేదని కలెక్టర్‌కు తహసీల్దార్ వివరించారు. ప్రస్తుతం భూమి స్థితిగతులపై ల్యాండ్ మేనేజ్మెంట్ కమిటీకి నివేదిస్తామని కలెక్టర్ తెలిపారు. కమిటీ నిర్ణయం మేరకు తదుపరి నిర్ణయాలు ఉంటాయని అన్నారు. కార్యక్రమంలో చీరాల తహసీల్దార్ షేక్ హుస్సేన్, సర్వేయర్లు పాల్గొన్నారు..
ఇదీ చదవండి:రసాభాసగా చీరాల మున్సిపల్ కౌన్సిల్ సమావేశం