వేసవిలో సముద్రజీవులు పునరుత్పత్తి దశలో ఉంటాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఏటా రెండు నెలల పాటు చేపల వేటను నిషేధిస్తోంది. ఈ క్రమంలో.. నేటి నుంచి జూన్ 14 వరకు చేపల వేట నిషేధం అమలులో ఉంటుందని మత్స్యశాఖ అధికారులు తెలిపారు. ఫలితంగా ప్రకాశం జిల్లా చీరాల, వేటపాలెం, కొత్తపట్నం తదితర మండలాల్లోని తీర ప్రాంతాల్లో బోట్లు, వలలు సముద్ర తీరానికే పరిమితం అయ్యాయి. ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘించిన వారి పడవలు, వలలు స్వాధీనం చేసుకోవడమే కాక.. లైసెన్సులు, రాయితీలు రద్దు చేస్తామని మత్స్యశాఖ అధికారులు హెచ్చరించారు.
నేటి నుంచి చేపల వేట నిషేధం - Fishing latest news
నేటి నుంచి జూన్ 14 వరకు చేపల వేట నిషేధం అమలులో ఉంటుందని మత్స్య శాఖ అధికారులు చెప్పారు. ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘించిన వారి పడవలు, వలలు స్వాధీనం చేసుకుంటామని హెచ్చరించారు.
నేటినుంచి చేపల వేట నిషేదం