ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సముద్రంలో చిక్కుకున్న మత్స్యకారులు.. సహాయక చర్యలు చెేపట్టిన అధికారులు - chirala Fishermens Stuckked in Sea

Fishermens Stuckked in Sea : ప్రకాశం జిల్లాలో చేపల వేటకు వెళ్లిన మత్స్యకారులు సముద్రంలో చిక్కుకున్నారు. తుఫాను కారణంగా సముద్రంలో ఎటూ కదలలేని పరిస్థితి ఉండటంతో సమీప తీర ప్రాంతంలోని గ్రామస్థులకు సమాచారం అందించారు.

Fishermens
మత్స్యకారులు

By

Published : Dec 10, 2022, 6:30 PM IST

Fishermens Stuckked in Sea: ప్రకాశం జిల్లాకు చెందిన ఏడుగురు మత్స్యకారులు సముద్రంలో చిక్కుకున్నారు. చీరాల మండలానికి చెందిన మత్స్యకారులు ఆరు రోజుల క్రితం చేపల వేటకు సముద్రంలోకి బోటు సహాయంతో వెళ్లారు. తుఫాను కారణంగా సముద్రంలో బోటు నడపడానికి వీలు లేకుండా ఉండటంతో.. మధ్యలోనే ఉండిపోయారు. ఈ విషయాన్ని సమీప తీర ప్రాంతమైన సింగరాయకొండ మండలానికి చెందిన ఊళ్లపాలెం గ్రామస్థులకు ఫోన్​ ద్వారా తెలిపారు. దీంతో గ్రామస్థులు సింగరాయకొండ మండల రెవెన్యూ అధికారులు, మెరైన్​ పోలీసులకు, స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో అధికారులు అప్రమత్తమై.. తీర ప్రాంతానికి చేరుకుని వారిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details