నివర్ తుపాన్ ముంచుకొస్తోందని అధికారుల హెచ్చరికల జారీతో ప్రకాశం జిల్లాలోని సముద్రతీరంలో మత్స్యకారులు అప్రమత్తమయ్యారు. చీరాల మండలం వాడరేవు, వేటపాలెం, చినగంజాం సముద్ర తీర ప్రాంతాల్లో అధికారులు తుపాన్ హెచ్చరికలు జారీచేశారు. తీరంలో అధికారులు దండోరా వేయించారు. చేపల వేటకు వెళ్లిన వారు ఒడ్డుకు తిరిగి రావాలని, పడవలు, వలలు సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు.
తుపాన్ హెచ్చరికలతో మత్స్యకారులు అప్రమత్తం - nivar tufan
నివర్ తుపాన్ హెచ్చరికలతో ప్రకాశం జిల్లా చీరాలలోని మత్స్యకారులు అప్రమత్తమయ్యారు. చేపల వేటకు వెళ్లిన వారు త్వరగా ఒడ్డుకు తిరిగిరావాలని అధికారులు సూచించారు.
నివర్ తుపాన్ హెచ్చరికలతో మత్స్యకారులు అప్రమత్తం