ప్రకాశం జిల్లా చినగంజాం మండలం పల్లెపాలెంలో చేపలవేటకు వెళ్లిన మత్స్యకారులకు భారీ నల్లసొర చేప చిక్కింది. సముద్రంలో వల వేసి లాగే ప్రయత్నం చేయగా బరువుగా ఉండటంతో అతి కష్టం మీద ఒడ్డుకు లాక్కొచ్చి చూడగా వలలో నల్లసొర చేప పడి ఉంది. నల్లసొర చేప బరువు వెయ్యి కిలోలుంటుందని మత్స్యకారులు చెప్తున్నారు.
మత్స్యకారుల వలకు చిక్కిన భారీ సొర చేప - మత్స్యకారుల వలలో భారీ సొర చేప
ప్రకాశం జిల్లా చినగంజాం మండలం పల్లెపాలెం వద్ద సముద్రంలో గంగపుత్రులకు భారీ నల్లసొర చేప చిక్కింది. ఈ నల్ల సొర చేప బరువు వెయ్యి కిలోలు ఉంటుందని మత్స్యకారులు తెలిపారు.
మత్స్యకారుల వలలో భారీ సొర చేప
నల్లకోతి రకం సొరచేపగా మత్స్యకారులు పిలుచుకునే ఈ చేప విలువ లక్ష రూపాయల వరకు ఉంటుందని మత్స్యకారులు తెలిపారు.
ఇదీ చదవండి: 'మాస్క్ ధరించలేదని... అపస్మారకస్థితికి చేరేలా కొట్టారు'