ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

జిల్లాలో ప్రశాంతంగా ముగిసిన తొలి విడత పంచాయతీ ఎన్నికల ప్రక్రియ - ప్రకాశం జిల్లాలో పంచాయితీ ఫలితాల్లో వైకాపా స్థానాలు వార్తలు

ఉత్కంఠ రేపిన మొదట విడత స్థానిక ఎన్నికల ప్రక్రియ ప్రకాశం జిల్లాలో ప్రశాంతంగా ముగిసింది. తొలివిడతలో 227 పంచాయితీలకు ఎన్నికలు జరిగాయి.

first phase elections in prakasam
మొదటి విడతలో వైకాపా జోరు

By

Published : Feb 11, 2021, 7:47 PM IST

ప్రకాశం జిల్లాలో తొలివిడత 227 పంచాయితీలకు ఎన్నికలు జరిగాయి. ఇందులో.. స్వతంత్రంగా పోటీ చేసిన ఆరుగురు గెలుపొందారు. పలు చోట్లు ఘర్షణలు చోటు చేసుకోగా.. కొన్ని చోట్లు సర్పంచ్​ పదవిని పంచుకొని రాజీ పడ్డారు. చీమకుర్తి మండలం నిప్పట్ల పాడు పంచాయితీలో లెక్కింపు ఉత్కంఠంగా సాగింది.

ఇక్కడ ఓ అభ్యర్థి 3 ఓట్లతేడాతో గెలవగా.. అధికార పార్టీ నాయకులు పోస్టల్‌ బ్యాలెట్‌ లెక్కపెట్టాలని డిమాండ్‌ చేశారు. అప్పుడు.. ఇద్దరు అభ్యర్థులకు సమాన ఓట్లు లభించాయి. చివరికి.. ఎన్నికల అధికారులు బొమ్మా బొరుసు వేసి విజేతను ప్రకటించారు. కోటేశ్వరరావు విజయం సాధించారు.

ABOUT THE AUTHOR

...view details