ప్రకాశం జిల్లా కనిగిరి మండలం అడ్డ రోడ్ సంగటి హోటల్లో అగ్ని ప్రమాదం జరిగింది. మాలకొండయ్య అనే వ్యక్తికి చెందిన సంగటి హోటల్లో వంట చేస్తుండగా ప్రమాదవశాత్తు గ్యాస్ లీకై ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
గమనించిన స్థానికులు అగ్నిమాపక కేంద్రానికి సమాచారం ఇచ్చారు. ప్రమాదంలో స్కూటీ, వంట సామగ్రి ఆగ్నికి ఆహుతయ్యాయి. లక్ష రూపాయల వరకు ఆస్తి నష్టం వాటిల్లిందని అగ్నిమాపక అధికారి వెంకటస్వామి అంచనావేశారు.