ప్రకాశంజిల్లా టంగుటూరు మండలం సూరారెడ్డి పాలెం వద్ద అర్ధరాత్రి ఘోర ప్రమాదం జరిగింది. విజయవాడ నుంచి చెన్నై వెళ్తున్న గూడ్స్ రైలు నాయుడు పాలెం-బాపూజీ నగర్ మధ్య వంతెన దాటుతుండగా చివరన ఉన్న డీజిల్ బోగీలు విడిపోయి మంటలు అంటుకున్నాయి.
ట్రాక్ కుంగిపోవడంతో పట్టాలు తప్పి బోగీలు వంతెనపై నుంచి కిందపడ్డాయి. ఈ ప్రమాదంలో డీజిల్ బోగీలు దగ్ధమవడంతోపాటు, రైల్వే ట్రాక్ దాదాపు 200 మీటర్ల మేర ధ్వంసమైందని అధికారులు తెలిపారు. సుమారు రూ.80లక్షల నష్టం వాటిల్లినట్టు అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. విజయవాడ నుంచి రైల్వే రెస్క్యూ టీమ్ వచ్చి మరమ్మత్తులు చేపట్టారు. మధ్యాహ్నానితి పునరోద్దరణ పనులు చేపడతామని విజయవాడ ఏడీఆర్ఎం రామరాజు తెలిపారు.