ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పేర్నిమిట్ట శానిటైజర్ పరిశ్రమలో అగ్నిప్రమాదం - ప్రకాశం జిల్లాలో శానిటైజర్ పరిశ్రమలో అగ్నిప్రమాదం

ప్రకాశం జిల్లా పేర్నిమిట్టలో శానిటైజర్ పరిశ్రమలో అగ్ని ప్రమాదం జరిగింది. ఏసీల కారణంగా ఈ ప్రమాదం జరిగిందని.. ఎవ్వరికి గాయాలు కాలేదని పరిశ్రమ ప్రతినిధి డాక్టర్.కమల తెలిపారు.

fire accident in sanitizer industry is caused due to ac
ఏసీల కారణంగా శానిటైజర్ పరిశ్రమలో అగ్నిప్రమాదం

By

Published : May 15, 2020, 5:39 PM IST

ప్రకాశం జిల్లా ఒంగోలు పేర్నిమిట్ట సమీపంలోని మినో ఫామ్‌ ఔషధ పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఇవాళ ఉదయం 11:30 గంటలకు ఏసీ యంత్రాల వల్ల ఈ ప్రమాదం సంభవించి... రెండు అంతస్తులకు దట్టమైన పొగలు వ్యాపించాయని కంపెనీ ప్రతినిధులు పేర్కొన్నారు.

కరోనా కారణంగా ప్రభుత్వం అనుమతితో... పరిశ్రమలో నెల రోజులుగా శానిటైజర్లు తయారు చేస్తున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో సుమారు 20 మంది కార్మికులు విధుల్లో ఉన్నారు. ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని పరిశ్రమ ప్రతినిధి డాక్టర్.కమల పేర్కొన్నారు. పరిశ్రమలో కోట్ల విలువచేసే సామగ్రి కాలిపోయిందని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details