ప్రకాశం జిల్లా మార్కాపురంలోని ఉప కార్యనిర్వాహక ఇంజనీర్ కార్యాలయంలో అగ్ని ప్రమాదం జరిగింది. కార్యాలయం ఆవరణలో ఉన్న పైపులకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. ఈ ప్రమాదంలో రూ.12 లక్షల విలువచేసే పైపులు అగ్నికి ఆహుతయ్యాయి. మార్కాపురం జిల్లా వైద్యశాలకు సాగర్ నీటి పైపు లైన్ వేసేందుకు గుత్తేదారు పైపులను కార్యాలయంలో ఉంచారు. ఈ నేపథ్యంలో దుండగులు నిప్పు పెట్టడంతో పైపులతో పాటు కార్యాలయ కిటికీలు, తలుపులు పూర్తిగా కాలిపోయాయి. అగ్ని ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Fire Accident: మార్కాపురంలో భారీ అగ్ని ప్రమాదం.. రూ.12 లక్షల ఆస్తి నష్టం - మార్కాపురం అగ్నిప్రమాదం వార్తలు
ప్రకాశం జిల్లా మార్కాపురంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఉప కార్యనిర్వాహక ఇంజనీర్ కార్యాలయంలో జరిగిన ఈ ప్రమాదంలో రూ.12 లక్షల విలువ చేసే పైపులు దగ్ధమయ్యాయి.
fire accident in govt office in markapuram prakasham district