ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

షార్ట్ సర్క్యూట్​తో ఏటీఎంలో అగ్ని ప్రమాదం - విద్యుత్ షార్ట్ సర్క్యూట్​తో ఏటీఎంలో అగ్ని ప్రమాదం

విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల ఏటీఎంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న ఘటన ప్రకాశం జిల్లా గుడిపాటిపల్లిలో జరిగింది. ఈ ప్రమాదంలో ఏటీఎం మిషన్​తో పాటు ఏసీ, రెండు సీసీ కెమెరాలు పూర్తిగా దగ్ధమయ్యాయి.

విద్యుత్ షార్ట్ సర్క్యూట్​తో  ఏటీఎంలో అగ్ని ప్రమాదం
విద్యుత్ షార్ట్ సర్క్యూట్​తో ఏటీఎంలో అగ్ని ప్రమాదం

By

Published : May 30, 2020, 5:25 PM IST

ప్రకాశంజిల్లా వెలిగండ్ల మండలం గుడిపాటిపల్లి గ్రామంలోని ఇండియన్ బ్యాంక్ ఏటీఎంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగి దట్టమైన పొగలు అలుముకున్నాయి. ప్రమాదాన్ని గుర్తించిన ఏటీఎం సిబ్బంది వెంటనే........కనిగిరి అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వారు ఘటనాస్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. ఈఘటనలో ఏసీ , రెండు సీసీ కెమెరాలు, ఏటీయం యంత్రం పూర్తిగా దగ్ధమైనట్లు అగ్నిమాపక ఎస్​ఐ రామస్వామి వెల్లడించారు. కాగా ఏటీఎంలోని డబ్బు వివరాలు తెలియాల్సి ఉంది.

ABOUT THE AUTHOR

...view details