FIRE ACCIDENT: ప్రకాశం జిల్లా మార్కాపురంలోని సాయిబాలాజీ థియేటర్ సమీపంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. థియేటర్ పక్కనే ఉన్న టింబర్ డిపోలో మంటలు చెలరేగి... పక్కనే ఉన్న ప్లాస్టిక్ పరిశ్రమకు వ్యాపించాయి. చెక్క, ప్లాస్టిక్ సామగ్రి ఉండటంతో భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి. దట్టమైన పొగ ఆ ప్రాంతమంతా అలుముకుంది. అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నా.. అదుపులోకి రావడం లేదు.
టింబర్ డిపోలో భారీ అగ్ని ప్రమాదం.. సుమారు రూ.20లక్షల ఆస్తినష్టం
FIRE ACCIDENT: ఓ టింబర్ డిపోలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఉన్నట్టుండి అవి పక్కనే ఉన్న ప్లాస్టిక్ పరిశ్రమకు వ్యాపించాయి. చెక్క, ప్లాస్టిక్ సామగ్రి ఉండటంతో భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నా.. అదుపులోకి రావడం లేదు. ఈ ఘటన ప్రకాశం జిల్లా మార్కాపురంలో జరిగింది.
టింబర్ డిపోలో భారీ అగ్ని ప్రమాదం
దుండగులు ఎవరైనా నిప్పు పెట్టారా లేక ప్రమాదవశాత్తూ సంభవించిందా అనేదానిపై స్పష్టత రావాల్సి ఉంది. మంటలు ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది, పురపాలక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. చుట్టుపక్కల మరిన్ని చెక్క సంబంధిత పరిశ్రమలు ఉండటంతో.. వాటికి మంటలు వ్యాపించకుండా తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు. సుమారు 20లక్షల రూపాయల మేర ఆస్తి నష్టం వాటిల్లిందని బాధితులు తెలిపారు.
ఇదీ చదవండి: భూమి కబ్జా చేశారని.. కాకినాడ కలెక్టరేట్ వద్ద మహిళల ఆత్మహత్యాయత్నం