ప్రకాశం జిల్లా పర్చూరులోని స్టేట్‌బ్యాంక్ ఏటీయంలో మంటలు చెలరేగాయి. ఏటీయం గదిలో నుంచి పొగలు రావటాన్ని గమనించిన స్థానికులు.. బ్యాంకు అధికారులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. నీళ్లు చల్లుతూ మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. అప్రమత్తమైన విద్యుత్ శాఖ అధికారులు కరెంట్ సరఫరా నిలిపివేశారు.
పోలీసులు, బ్యాంక్ అధికారులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగి ఉండవచ్చని భావిస్తున్నారు. ఏటీయం మిషన్ లోపల ఉన్న నగదు సురక్షితంగానే ఉంటుందని చెప్పారు.