యావత్ ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం దశలవారీగా లాక్డౌన్ విధించింది. అప్పటి నుంచి ప్రజలందరు ఇళ్లకే పరిమితమాయ్యారు. కేసులు నమోదుకానీ ప్రాంతాల్లో నిబంధనలతో కూడిన సడలింపులు ఇవ్వడంతో ప్రజలు బయటికి వస్తున్నారు. భౌతికదూరం పాటిస్తూ… మాస్కులు తప్పనిసరిగా ధరించాలని అధికారులు ప్రజలకు సూచిస్తున్నారు.
ఇవాళ ఒక్కరోజే వంద మందికి జరిమానా… ఎందుకో తెలుసా..?
మాస్కులు లేకుండా రహదారిపై తిరుగుతున్నవారికి యర్రగొండపాలెం అధికారులు జరిమానా విధించారు. పట్టణంలో ప్రతీఒక్కరూ మాస్కులు ధరించాలని పంచాయతీ అధికారులు సూచిస్తున్నారు. మాస్కులు ధరించకుండా బయట తిరుగుతున్నవారికి ఒక్కొక్కరికి రూ.100 చొప్పున జరిమానా విధించారు.
అయితే మాస్కులు లేకుండా రహదారిపై తిరుగుతున్నవారికి యర్రగొండపాలెం అధికారులు జరిమానా విధించారు. పట్టణంలో ప్రతీఒక్కరూ మాస్కులు ధరించాలని పంచాయతీ అధికారులు సూచిస్తున్నారు. మాస్కులు ధరించకుండా బయట తిరుగుతున్నవారికి ఒక్కొక్కరికి రూ.100 చొప్పున జరిమానా విధించారు. ఇవాళ ఒక్కరోజే వంద మందికి జరిమానా విధించారు. ప్రభుత్వ సూచనలు, సలహాలు పాటించి కరోనా వైరస్ ప్రబలకుండా అధికారులకు సహకరించాలని పంచాయతీ కార్యదర్శి రాజశేఖర్ రెడ్డివిజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండీ... రాష్ట్రంలో కొత్తగా 57 కరోనా పాజిటివ్ కేసులు..ఇద్దరు మృతి