FEVERS IN PRAKASAM : ప్రకాశం జిల్లా పొదిలి మండలంలోని గ్రామాల్లో.. కొద్దిరోజులుగా జ్వర పీడితుల సంఖ్య పెరిగింది. పదేళ్ల లోపు పిల్లలు ఎక్కువగా జ్వరాలతో ఇబ్బందిపడుతున్నారు. ఉన్నట్టుండి సామాజిక ఆరోగ్య కేంద్రంలో ఇన్ పేషంట్ల సంఖ్య భారీగా పెరిగింది. 200 ఓపీ ఉన్న ఆసుపత్రికి.. రోజూ 300మంది జ్వరాలతో వస్తుండడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. మాదిరెడ్డిపాలెంలో ఇటీవలే ఇద్దరు చిన్నారులు.. జ్వరంతో మృతి చెందారు. ఒంగోలు, గుంటూరు తీసుకెళ్లినా తమ బిడ్డలు దక్కలేదని వారి కుటుంబ సభ్యులు వాపోయారు. గ్రామంలో పారిశుద్ధ్యం సరిగాలేకే జ్వరాలు విజృంభించి ప్రాణాలు పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు.
పారిశుద్ధ్య లోపం.. పంజా విసురుతున్న జ్వరాలు.. ఇద్దరు చిన్నారులు మృతి - పొదిలి
Fever Victims Increased : పారిశుద్ధ్య లోపం.. పల్లెలకు శాపంగా మారింది. జ్వరాలు పంజా విసురుతున్నాయి. ఇంట్లో ఎవరో ఒకరు మంచాన పడడం, జ్వర పీడితుల్లో ఎక్కువగా చిన్నారులు ఉండడం పడడం కలవరపరుస్తోంది. ప్రకాశం జిల్లా.. పొదిలిలో విష జ్వరాల విజృంభణపై ప్రత్యేక కథనం.
FEVERS IN PRAKASAM
పొదిలి మండలంలోని చాలా గ్రామాలకు ట్యాంకుల ద్వారా నీటిని సరఫరా జరుగుతోంది. వారం, పది రోజులకొకసారి నీటిని సరఫరా చేయడం వల్ల.. వాటిని స్థానికులు డ్రమ్ముల్లో భద్రపరుచుకుంటారు. దీని వల్ల దోమలు వృద్ధి చెంది జ్వరాలు వస్తున్నాయని వైద్యాధికారులు అంటున్నారు. పంచాయతీ, మున్సిపల్ అధికారులు తాగునీరు, పారిశుద్ధ్యంపై దృష్టి పెడితే జ్వరాలను అరికట్టవచ్చని .. స్థానికులు సూచిస్తున్నారు.
ఇవీ చదవండి: