ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

6 నెలల పసి కందును గొంతు నులిపి చంపిన తండ్రి - అమనిగూడిపాడులో కూతుర్ని చంపిన తండ్రి

మానవ సంబంధాలు కనుమరుగైపోతాయేమో అనేందుకు ఉదాహరణే ఈ సంఘటన. వ్యసనాలకు అలవాటు పడిన మనిషి ఏ విధంగా క్రూరంగా మారుతారో అని చెప్పేందుకు సరిగ్గా సరిపోలే ఘటన. చెడుసావాసాలకు అలవాటు పడి... భార్యను డబ్బు అడిగితే లేవని చెప్పినందుకు ఆరు నెలల కన్నకూతురి గొంతు నులిమేశాడు ఓ తండ్రి.

father killed daughter
డబ్బు కోసం కూతరిని చంపేశాడు

By

Published : Jun 19, 2020, 10:19 AM IST

డబ్బులు ఇవ్వలేదని భార్యపై కోపంతో.. 6 నెలల పసి కందును గొంతు నులిపి చంపిన సంఘటన ప్రకాశం జిల్లా యర్రగొండపలెం మండలం అమనిగూడిపాడులో చోటు చేసుకుంది. ఎస్సీ కాలనీకి చెందిన బాల ఏసు వ్యసనాలకు బానిసైయ్యాడు. డబ్బులివ్వమని భార్యను అడగగా.. తన దగ్గర లేవని చెప్పడంతో కోపంతో పక్కనే ఉన్న ఆరు నెలల కూతురి గొంతు నులిమేశాడు. భార్య అడ్డుకునేందుకు ప్రయతించినప్పటికీ ఆ పసికందు ప్రాణాలు నిలువ లేదు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ABOUT THE AUTHOR

...view details