Fatal Road Accident at Lingareddy Colony: ప్రకాశం జిల్లా తర్లుపాడు మండలం లింగారెడ్డికాలనీ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ముందున్న ద్విచక్ర వాహనాన్ని ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు మార్కాపురం పట్టణానికి చెందిన సుబ్బారాయుడు, విభూది మౌలాలిగా పోలీసులు గుర్తించారు. ఆర్టీసీ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ప్రకాశం జిల్లాలో బైక్ను ఢీకొన్న ఆర్టీసీ బస్సు.. ఇద్దరు మృతి - Prakasam Latest News
Fatal road accident at Lingareddy Colony: ముందున్న ద్విచక్ర వాహనాన్ని ఆర్టీసీ బస్సు ఢీకొన్న ఘటన ప్రకాశం జిల్లా తర్లుపాడు మండలం లింగారెడ్డికాలనీ వద్ద జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.
Fatal road accident at Lingareddy Colony