ప్రకాశం జిల్లాలో వాహనాల్లో గుంపులుగా వ్యవసాయ పనులకు వెళ్తున్న అన్నదాతలను పోలీసులు, వాలంటీర్లు నిలిపివేశారు. భౌతిక దూరం పాటించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరూ మూడు అడుగుల దూరాన్ని పాటించాలని సూచించారు. నిబంధనలను అతిక్రమించినందుకు కర్షకులతో గుంజీళ్లు తీయించారు. సామాజిక దూరం పాటిస్తూ వ్యవసాయ పనులు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
లాక్డౌన్ సడలింపు... గుంపులుగా వ్యవసాయ పనులకు
రాష్ట్రంలో కొనసాగుతున్న లాక్డౌన్తో నిత్యావసర సేవలు మినహా సమస్తం నిలిచిపోయాయి. పంట చేతికొచ్చే సమయం కావడంతో అధికారులు రైతులకు ఈ నిబంధన నుంచి మినహాయింపు ఇచ్చారు. అయితే ప్రకాశం జిల్లాలో కొంతమంది రైతన్నలు ఈ సడలింపును దుర్వినియోగం చేస్తున్నారు. గుంపులుగా ప్రయాణం చేస్తూ భౌతిక దూరాన్ని పాటించడాన్ని విస్మరిస్తున్నారు.
లాక్డౌన్ ఉల్లంఘనతో గుంజీళ్లు తీస్తున్న రైతులు