కేంద్ర ప్రభుత్వం ప్రాంతీయ సమగ్ర ఆర్థిక ఒప్పందం నుంచి వెంటనే వైదొలగాలని కోరుతూ రైతు సంఘం ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా ఒంగోలు కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. పాడి పరిశ్రమకు తీవ్ర నష్టం చేకూర్చే ఆ ఒప్పందం రైతులకు శాపంగా మారుతుందన్నారు. విదేశాల నుంచి భారీ స్థాయిలో పాడి పరిశ్రమకు సంబంధిత దిగుమతులు ఎక్కువ అవుతాయని తద్వారా పాడి పరిశ్రమపై ఆధారపడి జీవనం సాగిస్తున్న చిన్నకారు రైతులు రోడ్డునపడే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఒప్పంద ప్రతులను కాల్చివేసి రైతు సంఘాల నాయకులు తమ నిరసన తెలిపారు. ప్రభుత్వం నిర్ణయాన్ని ఉపసంహరణ చేసుకోకుంటే రైతు సంఘాలను కలుపుకుని ఉద్యమిస్తామని హెచ్చరించారు.
'ప్రాంతీయ సమగ్ర ఆర్థిక ఒప్పందం నుంచి భారత్ వైదొలగాలి' - ఒంగోలు రైతు సంఘం న్యూస్
ప్రాంతీయ సమగ్ర ఆర్థిక ఒప్పందం నుంచి కేంద్ర ప్రభుత్వం వెంటనే తప్పుకోవాలని కోరుతూ రైతు సంఘం ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా ఒంగోలులో కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఒప్పంద ప్రతులను కాల్చివేసి రైతు సంఘాల నాయకులు తమ నిరసన తెలిపారు.
farmers union dharna at ongole collectorate