ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలం శంకరాపురంలో ప్రతి ఏటా రైతులు కంది, ప్రత్తి, శనగ పంటలు పండిస్తారు. అయితే సరైన దిగుబడి రాక ఇబ్బందులు పడుతున్న తరుణంలో అధికారుల సూచనతో అంటుకొర్ర పంట వేశారు. క్వింటాకు 7 నుంచి 10 వేల రూపాయల వరకూ ధర పలుకుతుందని ఆశించారు. ఒక్కో ఎకరాకు 3 నుంచి 5 క్వింటాళ్ల వరకు దిగుబడి వచ్చింది. తీరా పంట చేతికొచ్చేసరికి కోనే నాథుడే లేకపోవడం వల్ల రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎకరాకు 10 నుంచి 15 వేల వరకు ఖర్చైందని.. ఇప్పుడు గిట్టుబాటు ధర లేక నష్టపోతున్నామని అన్నదాతలు వాపోయారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరారు.
గిట్టుబాటు ధరలేక.. ఆవేదనలో అంటుకొర్ర రైతులు - farmers facing problems at shankarapuram village
ప్రకాశం జిల్లాలో అంటుకొర్ర రైతులు గిట్టుబాటు ధర లేక ఇబ్బందులు పడుతున్నారు. అధికారుల సూచనతో ఈ పంట వేశామని.. కనీసం పెట్టిన పెట్టుబడి సైతం రావడం లేదని వాపోతున్నారు.
![గిట్టుబాటు ధరలేక.. ఆవేదనలో అంటుకొర్ర రైతులు farmers suffering problems at prakasham district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7383618-443-7383618-1590675445817.jpg)
తన ఆవేదనని తెలుపుతున్న రైతు