Farmers Suffering Due to Rain Conditions in AP: తీవ్ర వర్షాభావంతో ప్రకాశం జిల్లాలో రైతులను కరవు ఛాయలు వెంటాడుతున్నాయి. లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి.. చినుకు రాకకోసం, సాగునీటి కోసం ఎదురు చూస్తున్న అన్నదాతలకు నిరాశే మిగులుతోంది. అందుబాటులో సాగునీటి వనరులు ఉన్నా సక్రమంగా వినియోగించుకోలేని దుస్థితి నెలకొనడంతో రైతన్నలు లబోదిబోమంటున్నారు. మిరపను సాగు చేస్తున్న రైతులు.. గతిలేని పరిస్థితుల్లో పంటను కాపాడుకునేందుకు నీటిని కొనుగోలు చేయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Prakasam District Chilli Farmers Problems: ప్రకాశం జిల్లాలో వాణిజ్య పంటగా రైతులకు ఆర్థిక భరోసా కల్పించే మిరప పరిస్థితి దయానీయంగా ఉంది. తీవ్ర వర్షాభావ పరిస్థితులు, సాగునీరు అందకపోవడంతో పంట ఎండిపోయే పరిస్థితి ఏర్పడింది. నాగులపాడు, ఇంకొల్లు, మద్దిపాడు తదితర మండలాల్లో అత్యధిక విస్తీర్ణంలో రైతులు మిరప సాగు చేస్తున్నారు. కౌలుకు, నారుకు, ఎరువులు, పురుగుల మందులకు ఇప్పటికే లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టినట్లు అన్నదాతలు వివరిస్తున్నారు. మిరప నాట్లు వేసినప్పటి నుంచి సరిపడా నీరు లేక ఇబ్బంది పడుతున్నామని సాగుదారులు వాపోతున్నారు.
CM Jagan Careless About Farmers: గుండ్లకమ్మ ప్రాజెక్టు ఆయకట్టు పరిధిలో ఉన్న పొలాలకూ పూర్తిస్థాయిలో నీరు అందడం లేదు. ప్రాజెక్ట్ గేట్లు ఏర్పాటు చేయకపోవడంతో కాలువలకు నీటిని మళ్లించలేని పరిస్థితి నెలకొంది. ప్రధానంగా శివారు భూములకు నీరందక రైతులు అవస్థలు పడుతున్నారు. ఎలాగైనా పంటను కాపాడుకోవాలని ట్యాంకర్ల ద్వారా నీటిని కొనుగోలు చేసి పంటకు తడులు అందిస్తున్నారు. వర్షాధారంతో సాగు చేసే రైతుల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. మొదటిసారి వేసిన నాట్లకు నీరు అందక మొక్కలు ఎండిపోయాయని.